Making Salt : సముద్రపు నీటితో ఉప్పు తయారీ..

ఉప్పును డిసెంబర్ నుంచి జూన్ వరకూ పండిస్తారు. వాతావరణం అనుకూలించకపోతే మే నెలతోనే ఈ పంటను నిలిపివేస్తారు. సీజన్ ప్రారంభానికి రెండు నెలలు ముందు నుంచి నేలను చదును చేసే పని చేపడతారు.

Making Salt : సముద్రపు నీటితో ఉప్పు తయారీ..

Making Salt

Updated On : August 31, 2023 / 10:24 AM IST

Making Salt : మీరు ఏ ఉప్పు తింటారు..? మీకైదైనా కంపెనీ పేరు గుర్తోస్తుందా..? అయితే ఆగండీ.. కంపెనీల కంటే ముందు ఈ ఉప్పు రైతులది. అది పొలాల్లో ఇలా ఉంటుంది. ఇదే ఉప్పు మీ దగ్గరికి వచ్చే సరికి వేరే రూపంలో ఉంటుంది. ఉప్పు ఎలా తయారు చేస్తారు. అది మీ కిచెన్ వరకు ఎలా వస్తుందో.. ఈ స్టోరీలో చూద్దాం…

READ ALSO : Nara Lokesh : జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, 20లక్షలు ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్

వంటకాల్లో ఉప్పు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకనే ఉప్పులేని పప్పు అనే సామెత కూడా పుట్టింది. ఆరు రుచుల్లో చౌకగా దొరికేది ఉప్పు. అలాగని ఉప్పును ఎక్కువ వాడినా ఆరోగ్యానికి ముప్పే. అలాంటి ఉప్పును పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం మండలం, పెదమైనవానిలంక గ్రామ రైతులు పండిస్తూ.. జీవనం పొందుతున్నారు.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మడులను చూడండీ.. ఇవన్ని ఉప్పుమడులు. సముద్ర తీరాన ఉన్న ఈ భూములు ఉప్పు పంటకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఉప్పును డిసెంబర్ నుంచి జూన్ వరకూ పండిస్తారు. వాతావరణం అనుకూలించకపోతే మే నెలతోనే ఈ పంటను నిలిపివేస్తారు. సీజన్ ప్రారంభానికి రెండు నెలలు ముందు నుంచి నేలను చదును చేసే పని చేపడతారు. ఇందుకు పొడుగాటి కర్రకు అడుగున వెడల్పాటి చెక్క అమర్చిన పరికరాన్ని ఉపయోగిస్తారు. చదును చేసిన తరువాత ఆ భూమిని ఉప్పు పండించటానికి వీలుగా మడులుగా తీర్చిదిద్దుతారు.

READ ALSO : INDIA 3rd Meet: ఎన్డీయేలో మోదీ ఒక్కరే.. అదే ఇండియాలో చాలా మంది ఉన్నారట.. ఉద్దవ్ థాకరే ఉద్దేశం ఏంటంటే?

ఈ మడులను కొటారులు అంటారు. సముద్రపు నీటిని ఈ కొటారుల్లో ఎండగడతారు. సముద్ర నీరు అందుబాటులో లేకపోతే భూగర్భంలోకి బోర్లువేసి ఆ నీటిని ఉపయోగిస్తారు. రోజూ కొటారుల్లో నీటిని చెక్క కర్రతో ఒక మూలకు లాగుతారు. ఎండలు గట్టిగా కాస్తే మడుల్లో నింపిన నీరు ఆవిరైపోయి, నాలుగైదు రోజులనుంచే ఉప్పు పంట పండటం ప్రారంభమవుతుంది. అలా తయారైన ఉప్పు పలుకులను తేలికపాటి తెడ్లతో ఒక పక్కకు లాగుతారు.

తరువాత మడులను మళ్ళీ నీటితో నింపుతారు. ఉప్పు పండించడంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. మడులలోని ఉప్పు దక్కించుకోవడానికి ఎంతో శ్రమపడాలి. తయారైన ఉప్పును మడుల నుంచి బయటకు తరలించి రాశులుగా పోసి తాటాకులు కప్పుతారు. పంట చేతికందే సమయానికి వర్షాలు, తుఫానులు వస్తే అప్పటివరకు పడిన శ్రమ, పెట్టిన పెట్టుబడి నీటిపాలవుతుంది.

READ ALSO : G-20 Summit: రష్యా అధ్యక్షుడు పుతిన్‭కు అరెస్ట్ భయం.. అందుకే ఇండియాకు రావట్లేదట.. ఐసీసీ ఎందుకు ఆయనను వెంబడిస్తోంది?

ఉప్పు తయారీకి ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. పండిను తక్కువ ధరకే దళారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ లు పెట్టేందుకు స్థోమత లేకపోవడం ఇటు రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. మరోపక్క అయోడైజ్డ్ సాల్ట్ వాడకం పెరగడంవల్ల కూడా సాధారణ ఉప్పు డిమాండ్ తగ్గింది. దీంతో ఉప్పు తయారీపై ఆధారపడి జీవించే కార్మికులు ఇతర పనులకోసం వలసలు వెళ్తున్నారు. దీనికితోడు ఏడాదికి ఆరునెలలు మాత్రమే వారికి ఈ పని ఉంటోంది. ఉపాధి హామీ పథకంవల్ల ఈ ఉప్పు పనిచేయటానికి కూలీల దొరకటం లేదని ఉప్పు రైతలు వాపోతున్నారు.