INDIA 3rd Meet: ఎన్డీయేలో మోదీ ఒక్కరే.. అదే ఇండియాలో చాలా మంది ఉన్నారట.. ఉద్దవ్ థాకరే ఉద్దేశం ఏంటంటే?

ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.

INDIA 3rd Meet: ఎన్డీయేలో మోదీ ఒక్కరే.. అదే ఇండియాలో చాలా మంది ఉన్నారట.. ఉద్దవ్ థాకరే ఉద్దేశం ఏంటంటే?

2024 Elections: ఇండియా కూటమిలో ప్రధాన అభ్యర్థిపై వివాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ కూటమికి ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీ నేతలు తరుచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే దీనిని తనదైన శైలిలో తిప్పికొట్టారు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే. ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)లో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఒక్కరేనని, ఆయన తప్పితే ఆ కూటమికి మరో అభ్యర్థే లేరని అన్న ఆయన.. ఇండియాలో చాలా మంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారంటూ తిప్పికొట్టారు.

2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్‭సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

ముంబైలో జరిగే ఇండియా మూడవ సమావేశాల సందర్భంగా బుధవారం మహా వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ పాల్గొన్నారు. అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘మా కూటమిలో చాలా మంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారు. కానీ ఎన్డీయేలో నరేంద్రమోదీ తప్పితే ఎవరైనా ఉన్నారా? ఆయన తప్పితే వారికి వేరే అవకాశం ఉందా?’’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.

2024 Elections: ఇండియా కూటమి మూడో సమావేశానికి ఒకరోజే ఉంది.. అంతలోనే బాంబు పేల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం బిహార్ రాజధాని పాట్నాలో జరగ్గా, రెండవ సమావేశంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.