2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్‭సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది

2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్‭సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

Mayawati-BSP: దేశంలో రెండు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. జాతీయ, స్థానిక ప్రధాన పార్టీలన్నీ ఈ రెండు కూటముల్లో ఏదో ఒక దానితో జతకట్టాయి. అయితే దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఏ కూటమిలోనూ చేరలేదు. కొద్ది రోజులుగా ఈ పార్టీ స్టాండుపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అయితే తాజాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ స్టాండ్ ఏంటనేది స్పష్టం చేశారు ఆ పార్టీ సుప్రెమో మాయావతి.

Telangana Congress: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేతో కానీ కాంగ్రెస్ సహా విపక్షాల కూటమి ఇండియాతో కానీ కలిసే ప్రసక్తే లేదని మాయావతి అన్నారు. బుధవారం ఈ విషయమై తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఎన్డీయే, ఇండియా కూటములు పేదల వ్యతిరేకివి, కులతత్వ, వర్గ విబేధాలు కలవి, కార్పొరేట్లకు కొంత మంది అనుకూల, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలు, వీరి విధానాలకు వ్యతిరేకంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతోంది. కాబట్టి వారితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు. అందుకే మీడియాకు విజ్ఞప్తి చేసేదేంటంటే.. దయచేసి ఫేక్ న్యూస్ ప్రసారం చేయండి.

Tummala Nageswara Rao: కాంగ్రెస్‌లోకి తుమ్మల..! సెప్టెంబర్ రెండోవారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం ..

2007 లాగా, బీఎస్పీ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో ఒంటరిగా పోటీ చేస్తుంది. సమాజంలోని నిర్లక్ష్యానికి గురైన ప్రజలను పరస్పర సోదరభావంతో కాకుండా ప్రత్యర్థుల అవకతవకల ద్వారా ఏకం చేయాలని మీడియా మళ్లీ మళ్లీ అపోహలు ప్రచారం చేయకూడదు. ఇక్కడ అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది.

G-20 Summit: రష్యా అధ్యక్షుడు పుతిన్‭కు అరెస్ట్ భయం.. అందుకే ఇండియాకు రావట్లేదట.. ఐసీసీ ఎందుకు ఆయనను వెంబడిస్తోంది?

అంతేకాదు, బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన సహరాన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అగ్రనేతలను మెచ్చుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన మొదట ఈ పార్టీని వీడి వేరే పార్టీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం సహజం. అలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గమనించొచ్చు. అలాగే పార్టీపై జరిగే దుష్ప్రచారాన్ని ఖండించాలని మాయావతి పిలునిచ్చారు.