2024 Elections: ఇండియా కూటమి మూడో సమావేశానికి ఒకరోజే ఉంది.. అంతలోనే బాంబు పేల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

2024 Elections: ఇండియా కూటమి మూడో సమావేశానికి ఒకరోజే ఉంది.. అంతలోనే బాంబు పేల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

INDIA bloc: విపక్ష పార్టీల రెండు సమావేశాలు విజయవంతమైన అనతరం భారీ అంచనాల నడుమ మూడవ సమావేశానికి ముంబైలో దాదాపుగా ముస్తాబైంది. గురువారం (ఆగస్టు 31) శుక్రవారం (సెప్టెంబర్ 1) రెండు రోజుల పాటు ఈ సమావేశాలుజరగనున్నాయి. అయితే ఈ సమావేశాు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు (ఆగస్టు 30)న ఏదైతే వివాదానికి రాకూడదో అదే వివాదానికి వచ్చింది. అదేనంటి.. ప్రధాని పదవిపై వివాదం రాజుకుంది. తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిని చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tragedy : గుండెపోటుతో సోదరుడు మృతి.. బోరున విలపిస్తూ ఆఖరిసారి మృతదేహానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం మాట్లాడుతూ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. దేశంలో ద్రవ్యోల్బణం చాలా పెరిగిందని, అరవింద్ కేజ్రీవాల్ వస్తే దేశంలో ద్రవ్యోల్బణం ఆగిపోతుందని, అంతే కాకుండా దేశ అభివృద్ధికి కేజ్రీవాల్ విధానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆ పార్టీ నేతల వాదన. ఇక ఆ పార్టీకి చెందిన నేత, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కూడా మంగళవారం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి పార్టీ నేతలు తమ అధినేతనే ప్రధాని కావాలని కోరుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని మేము కోరుతున్నాం. అయితే, ఈ నిర్ణయం ఇండియా కూటమి నిర్ణయిస్తుంది’’ అని గోపాల్ రాయ్ అన్నారు.

G-20 Summit: రష్యా అధ్యక్షుడు పుతిన్‭కు అరెస్ట్ భయం.. అందుకే ఇండియాకు రావట్లేదట.. ఐసీసీ ఎందుకు ఆయనను వెంబడిస్తోంది?

ఢిల్లీ సర్వీస్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ అతిషి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థిత్వానికి సంబంధించిన వార్తలను ఖండించారు. ప్రధాని పదవి రేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారనే వార్తలను కేబినెట్ మంత్రి అతిషి ఖండించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకే ఆప్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష పార్టీల కూటమిలో చేరిందన్నారు. ఈ విషయంలో ప్రియాంక కక్కర్ చేసిన ప్రకటన ఆమె వ్యక్తిగత ప్రకటన కావచ్చునని అతిషి చెప్పారు.

2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్‭సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముంబైలో జరిగే సమావేశంలో ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రకటించే అవకాశం ఉందని కూటమి వర్గాల నుంచి తెలుస్తోంది. ఇకపోతే ప్రధాని అభ్యర్థి రేసులో కూడా కాంగ్రెస్ పార్టీ నేతనే రావొచ్చని అంటున్నారు. ఎలాగైనా సరే రాహుల్ గాంధీని ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ ఇలా కుదరకపోతే అభ్యర్థి లేకుండానే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.