Mango Farming : మామిడిలో పూత, పిందె నిలిచేందుకు సూచనలు

Mango Cultivation : పూత దశలో నీటి తడులు అందించకూడదు. తేనెమంచు పురుగు, బూడిద తెగుళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలి. పూత నుండి పిందె కట్టే సమయంలో ఎరువులు వేయాలి. బోరాన్ లోపం ఉన్నతోటల్లో బోరాక్స్ పిచికారి చేయాలి.

Mango Farming : మామిడిలో పూత, పిందె నిలిచేందుకు సూచనలు

Mango Farming

Updated On : January 1, 2024 / 6:52 PM IST

Mango Farming : ప్రతికూల వాతావరణంతో పాటు చీడపీడల దాడులతో మూడేండ్లుగా మామిడి రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదైనా మంచి దిగుబడులను సాధించాలంటే పూత దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తాయి.. వాటిని ఏవిధంగా నిర్మూలించాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రవంతి.

మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్, నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది. దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యం మరో ఎత్తు.

సమగ్ర యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడి  : 
మామిడిలో పూతంతా ఒకేసారి రాకుండ దశలుగా ఉంటుంది. దీంతో సుమారుగా ఒక నెల మొత్తం పూత కాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కాత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

Read Also : Papaya Cultivation Techniques : బొప్పాయిలో సూక్ష్మధాతు లోపం నివారణ.. సూచనలిస్తున్న శాస్త్రవేత్తలు

కాబట్టి పూత, కాత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు, ఒక వేళా చేసిన దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.  పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రవంతి.

మామిడి పంటలో పూతదశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. అయితే పూత నుండి కాయ దశలో చీడపీడలు అధికంగా ఆశిస్తు ఉంటాయి. ముఖ్యంగా తేనెమంచుపురుగు, మసిమంగు, బూడిదతెగులు, పక్షికన్నుతెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.

మామిడి సాగు :
హెక్టారుకు దిగుబడి 3.5 -4 టన్నులు

నీటియాజమాన్యం :
పూతకు 2 నెలలకు ముందు నీటి తడులు ఆపాలి
పూత పిందెగా మారాక నీటితడి

ఎరువుల యాజమాన్యం :

పూత ఆలస్యమైన తోటల్లో 13-0 -45 ( పొటిషియం నైట్రేట్ ) 10 గ్రా.

లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పూత రాకముందు యూరియా 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
10 ఏళ్లు పైబడిన చెట్టుకు యూరియా అరకిలో భాస్వరం 1.5 కిలోలు పొటాష్ 500 గ్రా.

పిందె అధికంగా రాలుతుంటే :

ఎన్ఏఏ నాప్తలిన్ అస్టిక్ యాసిడ్ 2.5 గ్రా.

100 లీటర్లకు కలిపి పిచికారి చేయాలి

సూక్ష్మపోషకాల లోపం నివారణ :

మైక్రోన్యూట్రియన్స్ అర్కామ్యాంగో స్పేషల్ 5 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జూన్ – జులైలో ఒకసారి తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం 4 సార్లు పిచికారి

తేనెమంచు పురుగు, మసిమంగు నివారణ :
వేపనూనె 5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
డైమిథోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

ఇమిడాక్లోప్రిడ్ 0.33 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

మసిమంగు నివారణ :
గంజి ద్రావణం పిచికారి చేయాలి

గంజి ద్రావణం తయారీ : 
గంజి పొడి 2 కి. 4-5 లీటర్ల నీటిలో కలిపి మరింగించాలి
చిక్కబడిన ద్రావణాన్ని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి

పక్షికన్ను తెగులు నివారణ :

కార్బండిజమ్ 1 గ్రా.  లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా.
లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి

బూడిద తెగులు నివారణ :
వెటబుల్ సల్ఫర్ పిచికారి చేయాలి

పిండినల్లి నివారణ :
అక్టోబర్‌లో చెట్ల మొదళ్ల దగ్గర లిండన్ వేసుకోవాలి

Read Also : Azolla Cultivation : అజొల్లా పెంపకంతో రైతులకు లాభాలు.. మరెన్నో ఉపయోగాలు