Multi-Crop Cultivation : ప్రకృతి విధానంలో బహుళ పంటల సాగు

మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం.

Multi-Crop Cultivation : ప్రకృతి విధానంలో బహుళ పంటల సాగు

Multi-Crop Cultivation

Updated On : October 30, 2023 / 3:50 PM IST

Multi-Crop Cultivation : ప్రకృతి విధానంలో బహుళ పంటలు సాగుచేస్తూ ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. సేంద్రియ ఎరువులు, కషాయాలను ఉపయోగిస్తూ.. మామిడి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగుచేస్తున్నారు. అంతే కాదు పంట వెను పంట వేస్తూ మంచి లాభాలను పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం. రసాయన ఎరువులతో పంటలు పండించడం వల్ల పెట్టుబడులు పెరిగిపోయి.. వచ్చిన దిగుబడులు గిట్టుబాటు కాకపోయేవి.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ఈ నేపధ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడంతో గత రెండేళ్లుగా జీరోబడ్జెట్ సాగు చేయడం ప్రారంభిచారు. జెడ్.బి.ఎన్.ఎఫ్ సభ్యుల సహాకారంతో మామిడిలో అంతర పంటలుగా కూరగాయల సాగుచేపట్టి నిత్యం ఏదో పంటనుండి ఆదాయాన్ని పొందుతున్నారు.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

కూరగాయల రకాన్ని బట్టి నాటిన నలభై ఐదు రోజుల నుంచి తొమ్మిది నెలల వరకు పంట దిగుబడి వస్తుంది.  ఏదేని ఒక రకం  పంట కాలం ముగియగానే.. చదును చేసి , మరో రకం కూరగాయ మొక్కలు నాటుతున్నారు.  ఒక పంట అయిపోగానే వెను వెంటే మరో పంటను సాగుచేసేలా క్లష్టర్ టెక్నిషియన్స్ సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతే కాదు చీడపీడల నివారణకు ఎలాంటి కషాయాలు పిచికారి చేయాలి… అవి ఎలా తయారు చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు.