Mango Orchards : మామిడిలో గూడుపురుగల బెడద.. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలతో నివారించవచ్చు
Mango Orchards : గూరు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Pest Control In Mango Orchards
Mango Orchards : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు.
ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పూత ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆకు జల్లెడ గూడు పురుగు ఆశించింది దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వెంకటరెడ్డి.
Read Also : Paddy Cultivation : అతి పురాతన దేశీ వరి రకాల సాగుతో అధిక లాభాలు.. మార్కెట్లో మంచి డిమాండ్..!
పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.
అయితే, పూత సమయంలో , కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గూడు పరుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో నివారించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి గూరు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. వెంకటరెడ్డి.