Turmeric Crop : పసుపులో దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులు నివారణ

Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు.  పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు.

Turmeric Crop : పసుపులో దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులు నివారణ

Pest Control in Turmeric Crop

Updated On : October 14, 2024 / 2:56 PM IST

Turmeric Crop : వరుసగా కురుస్తున్న వర్షాలకు పసుపు పంటలో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే.. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో తెగుళ్లు ఉధృతమయ్యాయి. చాలా చోట్లో దుంపకుళ్లు , ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు రైతులు వాపోతున్నారు.  వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ డివిజన్ పరిధిలో రైతులు పండించే ప్రధాన పంట  పసుపు. దాదాపు 9 నెలల పాటు ఉండే ఈ పంటను జూన్ నుండి జులై నెల చివరివరకు రైతులు విత్తుకుంన్నారు. పసుపు సాగుకు ఆర్మూర్ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ఈపంటకు రైతులు ప్రాధాన్యతను ఇస్తారు. అయితే అధికంగా కురుస్తున్న వర్షాలు.. దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులుకు కారణమవుతున్నాయి. ఇవి ఆశించినట్లయితే పంట దిగుబడిఫై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు.  పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు ఆసాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యలను జాగ్రాత్తగా ఆచరించాలి.  అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట  తెగుళ్ళ బెడద ఎక్కువైంది.

ఇప్పటికే చాలా చోట్ల దుంపకుల్లు, ఆకుమచ్చ తెగులును గుర్తించినట్లు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. దుంప ఊరే దశలో ఈ తెగులు వల్ల నష్టం అపారంగా వుంటుందంటూ.. ఈ తెగులు నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆర్మూరు ఉద్యానశాఖ అధికారి.

Read Also : Cotton Bollworms : తామర పురుగుల కారణంగా తలమాడు తెగులు