Groundnut Pest Management : రబీ వేరుశనగకు చీడపీడల తాకిడి అధికం – సమగ్ర యాజమాన్య పద్ధతులు
Pest Management : రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు.

Pest Management in Groundnut
Groundnut Pest Management : నూనెగింజల పంటల్లో ముఖ్యమైంది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు.
అయితే, ఈ పంటకు తెగుళ్లు , పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. కాబట్టి తొలిదశ నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు విత్తగా , అక్కడక్కడ ఆలస్యమైన ప్రాంతాల్లో కొంత మంది విత్తేందుకు సిద్దమవుతున్నారు.
అయితే, రబీ వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ముందునుండే రైతులు జాగ్రత వహించాలి. ముక్యంగా చీడపీడలను తట్టుకునే రకాల ఎంపికతో పాటు.. దశల వారిగా వచ్చే చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.