Pest Control in Rice : వరిలో పురుగుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు

Pest Control in Rice : తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోను ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాలుగా మారింది.

Pest Control in Rice : వరిలో పురుగుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు

Precautions for Pest Control in Rice

Pest Control in Rice : రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోని రైతులు  వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. అయితే వానకాలం వరిసాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి30 శాతం దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.  ఇందుకోసం నారుమడి దశనుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోను ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్యలోపాలు ఒక కారణమైతే… ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి.

వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్నిబట్టి, సాగుచేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండంతొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోను, మురుగు నీటిపారుదల తక్కువగా వున్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. శ్రవణ్  కుమార్.

వరిసాగయ్యే అన్నిప్రాంతాల్లోను కాండంతొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కలపురుగు గోధుమ రంగులో వుండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి వుంటుంది.  ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు  పెడుతుంది.

ఈ గడ్లపై తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేస్తాయి. దీనివల్ల పిలకలు ఎండిపోతాయి. వీటని చేతితో లాగితే తేలిగ్గావూడివస్తాయి. కాండాన్ని చీల్చిచూసినప్పుడు లోపల పురుగును గమనించవచ్చు.  ఈ పురుగు 40 రోజులపాటు పైరుకు నష్టం కలిగిస్తుంది.

Read Also : Vedha Paddy : వెద పద్ధతిలోనే వరిసాగు చేస్తున్న రైతులు