Mango Coating : మామిడి తోటల్లో ప్రారంభమైన పూత – ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం  

Mango Coating : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.

Mango Coating : మామిడి తోటల్లో ప్రారంభమైన పూత – ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం  

Mango Coating

Updated On : January 8, 2025 / 2:25 PM IST

Mango Coating : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు.

Read Also :  Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  అయితే మామిడి  పూత (Mango Coating) ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు నూజిబీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాధారాణి.

పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో  రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే పూత వచ్చింది. మరికొన్ని తోటల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత ప్రారంభం కాలేదు.

అయితే మామిడిలో పూత, పిందే కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అవి కాయగా మారి, మంచి దిగుబడి వచ్చేందుకు సకాలంలో ఎరువులు వేయడము కూడా అంతే ముఖ్యం. మొక్కల వయస్సును బట్టి సకాలంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను అందించాలి.

ఎరువుల, కలుపు నీటియాజమాన్యం సకాలంలో చేపట్టినా.. పూత సమయంలో  పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ..  సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Read Also :  Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం