Prevention of Pests in chilli : ప్రస్తుతం మిరపలో ఆశించే చీడపీడల నివారణ

Prevention of Pests in chilli : తామరపురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లేదా డైఫెన్ థయూరాన్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Prevention of Pests in chilli : ప్రస్తుతం మిరపలో ఆశించే చీడపీడల నివారణ

Prevention of pests in chilli

Updated On : February 14, 2024 / 2:32 PM IST

ప్రస్థుతం చాలాప్రాంతాల్లో మిరప కోయ, కోత దశలో ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా మిరప తోటల్లో చీడపీడల ఉధృతి పెరింగిం. వీటి నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారి చేయాలో ఇప్పుడు చూద్దాం..

Read Also :Paddy Cultivation : రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు

మిరప పంట పూత, కాయ ఏర్పడే దశ నుండి కాయ కోసే దశవరకు ఉన్నది. పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మి. లీ. లేదా టెబుకొనజోల్ + గందకము 2.5 గ్రా. లేదా కార్బెండిజమ్ + మ్యాంకోజెబ్ 1.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

చాలాచోట్ల కాయకుళ్లు తెగులు గమనించడమైనది. నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో శనగపచ్చ పురుగు గమనించడమైనది . దీని నివారణకు ఫ్లూబెండమైడ్ + థయాస్లోఫ్రిడ్ 0.5 మి. లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ + ఫిప్రోనిల్ 1.2 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామరపురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లేదా డైఫెన్ థయూరాన్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో కోయినోఫొర కొమ్మకుళ్లు తెగులు గమనించడమైనది దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ + మెటిరామ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో జెమిని వైరస్ తెగులు గమనించడమైనది. నివారణకు వ్యాధి అభివృద్ధి చెందకుండా ఉండటానికి ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి.

వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుండి 10 అమర్చాలి. జెమిని వైరస్ నివారణకు పైరిప్రాక్సిపెన్ 1.5 మి. లీ. లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ 1 మి. లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో బూడిద తెగులు నివారణ :

3 గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా

అజాక్సిస్ట్రోబిన్ 1 మి. లీ. లేదా

టెబుకొనజోల్ + గందకము 2.5 గ్రా. లేదా

కార్బెండిజమ్ + మ్యాంకోజెబ్  1.5 గ్రా.

మిరపలో కాయకుళ్లు తెగులు నివారణ :

కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా

మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా

ప్రొపికోనజోల్ 1 మి.లీ.

లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో శనగపచ్చ పురుగు నివారణ :

ఫ్లూబెండమైడ్ + థయాస్లోఫ్రిడ్ 0.5 మి. లీ. లేదా
ఇమామెక్టిన్ బెంజోయేట్ + ఫిప్రోనిల్  1.2 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Mango Farming Beginners : మామిడి తోటల్లో పూత యాజమాన్యం.. తొలిదశలోనే అరికట్టాలంటే?