Cotton Cultivation : పత్తిలో కాండం తొలుచు పురుగు ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Cotton Cultivation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి.

Cotton Cultivation : పత్తిలో కాండం తొలుచు పురుగు ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Cotton Cultivation

Cotton Cultivation : తెలుగు రాష్ట్రాల్లోని రైతులు..  పత్తిని వర్షాధారంగా, మెట్టప్రాంతాల్లో  సాగుచేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అంచనాకు మించి రైతులు సాగుచేశారు. ప్రస్తుతం పత్తి, వివిధ ప్రాంతాల్లో 45  నుండి 60 రోజుల దశలో ఉంది.

Read Also : Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల నివారణ

అయితే, అటవీ ప్రాంతాలకు దగ్గరగా సాగుచేసిన పత్తికి కాండపు ముక్కు పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ , డా. జి. వీరన్న.

పత్తిపంటను ఆశించి నష్టపరిచే కీటకాలు ముఖ్యంగా రెండు రకాలు. రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులు. బీటీ పత్తి వచ్చిన తరువాత కాయతొలుచుపురుగుల ఉధృతి చాలా వరకు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ప్రధాన పురుగులతో పాటుగా, గతంలో అసలు ప్రాధాన్యత లేని కొన్ని రకాల పురుగులు పంటపై దాడిచేస్తున్నాయి. ముఖ్యంగా కాండపు ముక్కు పురుగు లాంటివి అడపాదడపా ఆశించి కొంత మేర నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి. ఇవి మొక్క మొదలు భాగంలో చిన్న రంధ్రాన్ని చేసి కాండంలోకి తొలుచుకుని పోయి నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను గురించి రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ , డా. జె. వీరన్న.

పత్తి మొక్కను 30 నుండి 70 రోజుల వరకు ముక్కు పురుగు ఎప్పుడైనా ఆశించవచ్చు. కంచెల దగ్గర, అడవుల దగ్గర సాగుచేస్తున్న రైతులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే కాండపు ముక్కు పురుగు బెడదను అధిగమించి ఆశించిన ఫలితాలు పొందడానికి వీలుంటుంది.

Read Also : Horticultural Crops : ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం