Rabi Onion Cultivation : ర‌బీ ఉల్లి నారు పెంప‌కంలో జాగ్ర‌త్త‌లు

Rabi Onion Cultivation : ఉల్లిసాగుకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. చాలా మంది రైతులు రబీఉల్లిని సాగుచేసేందుకు సిద్ధమవుతుంటారు.

Rabi Onion Cultivation : ర‌బీ ఉల్లి నారు పెంప‌కంలో జాగ్ర‌త్త‌లు

Rabi Onion Cultivation

Updated On : October 13, 2024 / 2:55 PM IST

Rabi Onion Cultivation : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన చరిత్ర ఉల్లిది. అలాంటి ఉల్లి మనప్రాంతంలో సుమారుగా 70వేల హెక్టార్లలో సాగుచేయబడుతోంది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి…ఇలా మూడు కాలాల్లోనూ సాగుచేస్తున్నా..  రబీపంట మంచి నాణ్యతతో, అధిక దిగుబడులనిస్తుంది. మరి రబీ ఉల్లిసాగుకు సమాయత్తమవుతున్న రైతులు సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల ఏంటో తెలయజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

Read Also : Oil Palm Cultivation : 20 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు.. లాభాలకు ఢోకా లేందంటున్న రైతు

ఉల్లిసాగుకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి చాలా మంది రైతులు రబీఉల్లిని సాగుచేసేందుకు సిద్ధమవుతుంటారు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ఉల్లి నారు పోసుకునే సమయం. ఈ పంట సాగుకు , మురుగు నీరు నిలవని , చౌడు, క్షార నేలలు తప్పా అన్ని  నేలలు అనుకాలంగా వుంటాయి.

ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల పంటకాలంలో, ఎకరాకు 120 నుంచి140 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. రబీకి అనువైన రకాలతో పాటు నారుమళ్ల పెంపకంపై ప్రత్యేక శద్ధ చూపాలని .. సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

ఉల్లి నారును నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి. సిఫారసు మేరకు ఎరువులను దఫదఫాలుగా అందించడమే కాకుండా.. భూములు, ఉష్ణోగ్రతలను బట్టి నీటితడులు అందిస్తూ ఉండాలి. అంతే కాదు చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లైతే అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది.

Read Also : Oil Palm Cultivation : 20 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు.. లాభాలకు ఢోకా లేందంటున్న రైతు