Rice Cultivation : రబీకి అనువైన సన్న, దొడ్డుగింజ వరి రకాలు – రైతులకు అందుబాటులో మేలైన రకాలు 

Rice Cultivation : తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్థుతం రబీపంటగా సాగుచేసే రైతుల కోసం సన్న , దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది.

Rice Cultivation : రబీకి అనువైన సన్న, దొడ్డుగింజ వరి రకాలు – రైతులకు అందుబాటులో మేలైన రకాలు 

Rice Cultivation In Rabi Season

Updated On : January 5, 2025 / 2:37 PM IST

Rice Cultivation : రబీ వరిసాగుకు  సమయం ఆసన్నమయ్యింది . రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి.

ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు . ప్రాంతాలకు అనుగుణంగా  వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో  రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు . తెలంగాణాకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్థుతం రబీపంటగా సాగుచేసే రైతుల కోసం సన్న , దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది నల్గొండ జిల్లా, కంపా సాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం . రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే ఈ రకాలవైపు దృష్టి సారిస్తే అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే మంది దిగుబడిని పొదవచ్చు. ప్రస్తుతం రబీసాగుకు సిద్ధమవుతున్న రైతులకోసం కంపసాగర్ పరిశోధనా స్థానంలో ఉన్న వరి రకాలు వాటి గుణగణాల గురించి వివరాలు తెలియజేస్తున్నారు.. కంపసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం  సీనియర్ శాస్త్రవేత్త, లింగయ్య.

Read Also : Lady finger Cultivation : వేసవి బెండసాగుకు అనువైన రకాలు – అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం