Seed Germination : విత్తేముందు విత్తన మెలక శాతం పరీక్ష చేయాలంటున్న శాస్త్రవేత్తలు
పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి, పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక, మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.

Seed Germination
Seed Germination : పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్తువ ఉంటేనే పొలంలోను, రైతు ముఖంలోనూ కళకళ.. లేకుంటే పెట్టుబడులు, శ్రమ అంతా నష్టపోయి దివాలా. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంతా బాగున్నా కరవు రూపంలోనో, తుపాన్లు, వరదల రూపంలోనో ప్రకృతి పగబడితే చేయగలిగేదేమీ ఉండదు.. కానీ, విత్తే పెను విపత్తయితే.. రైతు చిత్తు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పుడు విత్తనాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో చెప్పలేని పరిస్థితి. అందుకే విత్తే ముందే మొలకశాతం తెలుసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి
కాలాలవారిగా వాతావరణ పరిస్థితులను బట్టి అనువైన పంటల సాగుకు రైతులు సిద్దమవుతుంటారు. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. పంట వేసిన తరువాత దాని పెరుగుదల, దిగుబడులు చూసేవరకు విత్తనం నాణ్యమైనదా? నాసిరకమైనదా? తెలియదు. కానీ, అప్పటికే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
పొలం సిద్ధం చేయడానికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు, కూలీలకు… ఇలా భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతా చేశాక పంట ఎదగకపోతే మోసపోయామని గుర్తించి దిగాలు పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియక తల్లడిల్లుతున్నారు. విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి, వ్యవసాయశాఖలకు నియంత్రణ లేకపోవడం ఏటా రైతులు ఇలానే నష్టపోతున్నారు.
READ ALSO : Mulching System : మల్చింగ్ సాగు.. లాభాలు బాగు
పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి, పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక, మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శిరీష .
READ ALSO : Summer Ploughing : వేసవి దుక్కులతో తెగుళ్లకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్దయెత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా.. ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గతేడాది మినుము, సోయాచిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో వందలాది మంది రైతులు నష్టపోయారు. కాబట్టి రైతులు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.