Sorghum Cultivation : జొన్న సాగులో మేలైన యాజమాన్యం
వర్షాధారంగా పండే పంటల్లో జొన్నఒకటి. తెలంగాణలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ..మెట్టప్రాంతాల్లో లేదా, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని.. అధిక దిగుబడునిస్తుంది.

Sorghum Cultivation
Sorghum Cultivation : ఖరీఫ్‌లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న వర్షాలకు మెట్టప్రాంతాల్లో రైతులు.. జొన్నను విత్తుతున్నారు. ఈ నెల 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే జొన్నలో అధికదిగుబడులను పొందాలంటే సాగులే చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. నగేష్ కుమార్.
READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !
వర్షాధారంగా పండే పంటల్లో జొన్నఒకటి. తెలంగాణలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ..మెట్టప్రాంతాల్లో లేదా, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని.. అధిక దిగుబడునిస్తుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్నిరకాల నేలలు అనుకూలమైనప్పకీ, మురుగు నీరు నిలిచే భూములు, చౌడు నేలలు పనికిరావు.
READ ALSO : Sorghum Varieties : రైతులకు అందుబాటులో నూతన జొన్న రకాలు
జూలై 15 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకుంటే.. జొన్నలో మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశించి పంటకు నష్టం చేకూర్చుతాయి. కాబట్టి.. విత్తేముందుకు విత్తనశుద్ది చేసుకుంటే తొలిదశలో వచ్చే శిలీంద్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. నగేష్ కుమార్.
READ ALSO : Jowar cultivation : జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ..
జొన్నపంటను ఏకపంటగానే కాకుండా, అంతర పంటగా సాగుచేసుకునే వీలుంది. అంతే కాదు జొన్నలో చొప్పదిగుబడి అధికంగా ఉంటుంది.. ఇటు ఆహార పంటగానే కాకుండా పశువులకు దాణాగా పనికొస్తుంది. అయితే సకాలంలో, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లైతే అధిక దిగుబడులు పొందవచ్చు.