Paddy Cultivation : వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. 

Paddy Cultivation : వరి పంటలో  చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

rice crop

Updated On : August 2, 2023 / 8:18 AM IST

Paddy Cultivation : ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరిసాగును చేపట్టారు. ఇప్పటికి తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల వరినాట్లు పడుతుండగా, మరికొన్ని చోట్ల వరి నారుమడులు పోసుకుంటున్నారు. అయితే సన్నరకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎస్. మాలతి.

READ ALSO : Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలను ఈ సారి ప్రభుత్వం సన్నగింజ రకాలు 60 శాతం, దొడ్డు గింజ రకాలను 40 శాతం విస్తీర్ణంలో పండించాలని సూచించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలను నాట్లేయడం జరిగింది.

READ ALSO : Shade Net :షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో నారు పెంపకం

మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.  వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు  తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎస్. మాలతి. గత రబీలో కాటిక తెగులు అధికంగా ఆశించింది. ఈ ఖరీఫ్ లో వాటినుండి ముందస్తు చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.