Butterfat Milk : చలికాలంలో వెన్నశాతం పెరిగేందుకు చేపట్టాల్సిన చర్యలు  

Butterfat Milk : పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి.

Butterfat Milk : చలికాలంలో వెన్నశాతం పెరిగేందుకు చేపట్టాల్సిన చర్యలు  

butterfat content in milk

Updated On : December 20, 2024 / 2:08 PM IST

Butterfat Milk : పాడి రైతుల నుంచి పాలను సేకరించే డైరీ సంస్థలు పాలల్లోని వెన్న శాతాన్ని బట్టే ధరను నిర్ణయిస్తారు. పశువులు అధిక వెన్న శాతం కలిగిన పాల దిగుబడినిచ్చే ఈ చలికాలంలోనే రైతులు కొన్ని మేలైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందే వీలుంది. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలు ఏమిటో తెలుసుకుందాం.

పాలు మన ఆహారంలో అతి ముఖ్యమైనదిగా మారిపోవడం వల్ల, నాణ్యత విషయంలో ప్రజారోగ్య శాఖ కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలను చట్టంలో పొందుపరిచారు. దీని ప్రకారం గేదె పాలలో కనీసం 5 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌,  ఆవు పాలలో 3.5 శాతం వెన్న, 8.5 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఉండాలి. ఇంతకన్నా తక్కువగా ఉంటే అవి నాణ్యతలేని పాలుగా నిర్ణయిస్తారు.

దీనికోసం రంగు, రుచి, వాసన, వెన్న శాతం పరీక్షలు నిర్వహించి డైరీ ఫామ్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. అందువల్ల పాడిరైతులు మంచి లాభాలు సాధించడానికి నాణ్యమైన పాల దిగుబడికి కావాల్సిన చర్యలు తీసుకోవడం అవసరం. పాల నాణ్యతపై అవగాహన పెంచుకుంటే పాడి రైతులు నష్టాలను ఎదుర్కునే పరిస్తితిని దూరం చేసుకోవచ్చు.

పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి. అలాగే పశువు వయస్సు పెరిగిన కొద్దీ పాలల్లోని వెన్న శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ లలో తగ్గుదల ఉంటుంది కనుక; ఈ పాల ధర తక్కువ ఉంటుంది. పశువులు భయానికి లోనయినప్పుడు పాలను పిండకూడదు. ఆలాచేస్తే ఆ పాలల్లో వెన్న శాతం తక్కువైపోతుంది. పశువులు ఈనిన 15 రోజుల నుంచి 9 నెలల వరకూ ఇచ్చే పాలల్లో వెన్న అధికంగా ఉంటుంది అందువల్ల ఈ సమయం రైతులకు లాభసాటైన సమయం.

పాలను పితికే ముందు దూడకు తాపాలి. ఆ తరువాత పితికే పాల చారలను వేరే పాత్రలోకి పితికిన తరువాతే, ఆఖరి ధారల వరకూ పొందిన పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉండి, ఆరోగ్యవంతమైన పాలను పొందే వీలుంటుంది. రోజుకు 4 కిలోమీటర్ల నడక చేయడం వల్ల ఆరోగ్యస్థాయి పెరిగి వెన్న శాతం బాగుండే పాలను అందించగలుగుతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా, పాలలో నీరు ఏమాత్రం కలపకూడదు. ఇలా చేస్తే పలచబడ్డ పాలల్లో వెన్న శాతం తగ్గి , సరైన ధర రాదు. సరైన వెన్న శాతం పరీక్షించే పాల సేకరణ కేంద్రాలకే, పాలు పోస్తే సరైన ధర పొందచ్చు.

ప్రతీరోజూ పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే త్వరగా పిండేయడం కూడా ముఖ్యమే ఎందుకంటే పాల సేపుకి అవసరమయ్యే “ఆక్సీటోసిన్” అనే హార్మోన్ మెదడు నుంచి విడులైన 8 నిమిషాల వరకే రక్త ప్రసరణలో ఉంటుంది. ఇలా చేస్తే మంచి వెన్న కలిగిన పలు పొందచ్చు.

పశువుల మేత విషయంలో కూడా పీచు పధార్ధాల మెతను అందించడం వల్ల పొట్టలో ఉండే మేలుచేసే సూక్ష్మ క్రిములు సహకరిస్తూ కొన్ని ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి నిష్పత్తిని బట్టి పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువులు పాల దిగుబడితో పాటు వెన్న తక్కువుండే పాలను ఇస్తాయి. అలాగే గర్భకోశ వ్యాధి సోకిక పశువులు కూడా తక్కువ వెన్న కలిగిన పాలను ఇస్తాయి. కనుక జాగ్రత్త అవసరము.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు