Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకువచ్చిన నేవీ

ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి.  అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి   మండలం వెల్తు

Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకువచ్చిన నేవీ

Anantapuram Resuce Operation

Updated On : November 19, 2021 / 3:49 PM IST

Chitravathi River Rescue Operation :  ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి.  అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి   మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు  వరదనీటిలో చిక్కుకుంది.

కారులో ఉన్న నలుగురిని రక్షించేందుకు జేసీబీ తీసుకోని మరో ఆరుగురు గ్రామస్తులు వరద నీటిలో  వెళ్లారు. కారులోని వారిని రక్షించి బయటకు తీశారు. ఈ లోగా వరద ఉధృతి పెరిగింది. దీంతో జేసీబీ ఒడ్డుకు రావటం కూడా కష్టంగా మారింది. దీంతో మొత్తం 10 మంది జేసీబీలోనే ఉండిపోయారు. వరద ఉదృతి తగ్గితే తప్ప వారిని బయటకు తీసుకొచ్చే మార్గం కనిపించ లేదు.

Also Read : live-in relationship : చిన్నతనంలోనే భర్త మృతి-వేరోకరితో సహజీవనం….

తాళ్ల సాయంతో.. విద్యుత్   తీగల సాయంతో స్ధానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎం జగన్‌ని కలిసి విషయం తెలిపారు. వెంటనే   ఆయన బెంగుళూరు నుంచి హెలికాప్టర్ ను ఘటనా స్ధలానికి పంపించారు. స్ధానిక పోలీసుల  పర్యవేక్షణలో  హెలికాప్టర్  సాయంతో అందరినీ సురక్షింతగా బయటకు తీసుకు వచ్చారు.