ఏపీలో కరోనా పంజా… 1,30,557 పాజిటివ్ కేసులు… 1,281 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 07:23 PM IST
ఏపీలో కరోనా పంజా… 1,30,557 పాజిటివ్ కేసులు… 1,281 మంది మృతి

Updated On : July 30, 2020 / 7:59 PM IST

ఏపీలో భారీగా కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 10,167 కరోనా కేసులు నమోదు కాగా 68 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,281 మంది కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,89,077 శాంపిల్స్ పరీక్షించారు. పాజిటివ్ కేసుల శాతం 6.91గా ఉంది.

ఏపీలో 69,234 యాక్టివ్ కేసులు ఉండగా వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 57,147 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో గత 24 గంటల్లో 70,068 శాంపిల్స్ పరీక్షించగా 10,167 మంది కోవిడ్పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 4,618 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్ వల్ల తూర్పు గోదావరి 9, గుంటూరు 9, అనంతపురం 8, కర్నూలు 8, విశాఖ 8, చిత్తూరు 6, కడప 6, ప్రకాశం 4, విజయనగరం 4, కృష్ణా 3, నెల్లూరు 1, శ్రీకాకుళం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 18,90,077 శాంపిల్స్ పరీక్షించారు.

గత 24 గంటల్లో అనంతపురం 954, చిత్తూరు 509, తూర్పుగోదావరి 1441, గుంటూరు 946, కడప 753, కృష్ణా 271, కర్నూలు 1252, నెల్లూరు 702, ప్రకాశం 318, శ్రీకాకుళం 586, విశాఖ 1223, విజయనగరం 214, పశ్చిమ గోదావరి 998 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.