JNTUK 1st Night : కాకినాడ JNTU గెస్ట్‌హౌస్‌లో నూతన దంపతుల శోభనం
చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న తూర్పుగోదావరిజిల్లా కాకినాడ జెఎన్.టి.యు. గెస్ట్ హౌస్ ఓ ప్రొఫెసర్ నిర్వాకం వలన అపవిత్రం అయ్యింది.

Jntuk Guest House
JNTUK 1st Night : చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న తూర్పుగోదావరిజిల్లా కాకినాడ జెఎన్.టి.యు. గెస్ట్ హౌస్ ఓ ప్రొఫెసర్ నిర్వాకం వలన అపవిత్రం అయ్యింది. విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన విశ్వవిద్యాలయం గెస్ట్‌హౌస్‌లో శోభనం ఏర్పాట్లు చేయటం కలకలం రేపింది.
కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో ఆగస్ట్ 18 రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ..స్వర్ణ కుమారి గెస్ట్ హౌస్ లో మూడు రూములు బుకింగ్ చేసుకున్నారు.
అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నూతన దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు. నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.