ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు

AP corona cases : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోరనా నుంచి 2,747 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 11 మంది మృతి చెందారు.
ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 8,40,730కి చేరింది. ఇందులో 8,12,517 మంది చికిత్స కోలుకోగా 21,434 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,779 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లో 80,082 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 85,87,312 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
నవంబర్ 7న కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.