విశాఖలో కరోనా హైఅలర్ట్ : విదేశాల నుంచి వచ్చిన 453 మంది మిస్సింగ్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో కరోనా కలకలం నెలకొంది.
విదేశాల నుంచి వచ్చిన 453 మంది ఆచూకీ కనిపించడం లేదు. దీంతో విశాఖలో కరోనా హైఅలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చేవారితోనే కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో విశాఖ వచ్చిన విదేశీయుల ఆచూకీ కోసం పోలీసులు, వైద్య సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విదేశీయులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. విదేశాల నుంచి 90 బృందాలతో ఎవరూవిశాఖకు వచ్చారు అనేదానిపై మూడు సార్లు ఇంటింటా సర్వే నిర్వహించారు అధికారులు. 2,995 మంది విదేశీయుల నుంచి వచ్చినట్టు గుర్తించారు. వీరిలో 453 మంది అదృశ్యమయ్యారు. వీరంతా ఎక్కడికి వెళ్లారు అనేది తెలియడం లేదు.
విదేశాల నుంచిన వారిలో కొంతమంది తిరిగి విదేశాలకు వెళ్లినవారు ఉన్నారు. కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. ఈ 453 మంది విదేశీయుల్లో అందరూ ఇక్కడే ఉన్నారా? లేదా తిరిగి విదేశాలకు వెళ్లిపోయారా? పక్క రాష్టాలకు వెళ్లిపోయారా? అనే కోణంలో అధికారులు వెతికి పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో కరోనా క్వారంటైన్ పూర్తి చేసినవారు కూడా రోజువారి ఆరోగ్య పరిస్థితిపై నిఘా ఉంటుంది. ఏప్రిల్ 14 వరకు క్వారంటైన్ బాధితుల ఆరోగ్యానికి సంబంధించి పర్యవేక్షణ జరుగుతోంది.