YSR Statue : 60 అడుగుల వైఎస్ భారీ విగ్రహం ఆవిష్కరణ

అత్యంత ఎత్తైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కృతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో 60 అడుగుల వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

YSR Statue : 60 అడుగుల వైఎస్ భారీ విగ్రహం ఆవిష్కరణ

Ysr Statue

Updated On : September 3, 2021 / 4:29 PM IST

YSR Statue : అత్యంత ఎత్తైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కృతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో 60 అడుగుల వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం (సెప్టెంబర్ 2) రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతి సందర్బంగా ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని పలమనేరుకు చెందిన సీనియర్ నాయకుడు సి.వి కుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహ ఏర్పాటు ఆయన సుమారు రూ. 60 లక్షలు ఖర్చు చేశారు. అయితే ఈ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించాలని అనుకున్నారు. అది వీలు కాకపోవడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని సుబ్బిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇక విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సి.వి కుమార్ కుటుంబ సభ్యులు, కొద్దీ మంది వైసీపీ నేతలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ, జిల్లాకు చెందిన మంత్రులెవరూ హాజరు కాలేదు. స్థానిక నేతలు కూడా పెద్దగా కనిపించలేదు.