ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు..52 మంది మృతి

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 90 వేలకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో 88,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 52 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 985 మంది వైరస్ తో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని మరో 3208 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,255 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 44,431 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1324 కేసులు నమోదయ్యాయి. కర్నూలు 742, అనంతపురం 723, పశ్చిమ గోదావరి 1012, విశాఖ జిల్లాలో 936 మంది కరోనా బారిన పడ్డారు. గుంటూరు 656, విజయనగరం 523, కృష్ణా 407, శ్రీకాకుళం 349, చిత్తూరు 300, నెల్లూరు 299, కడప 294, ప్రకాశం 248 కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరు 9, పశ్చిమ గోదావరి 8, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. విజయనగరం 4, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.