Visakha : విష ఆహారం ఇచ్చి పిల్లలను చంపేందుకు యత్నించిన తండ్రి
విశాఖలో యారాడలో దారుణం జరిగింది. సొంత పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు.

Visakha
విశాఖలో యారాడలో దారుణం జరిగింది. సొంత పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు. యారాడలో నివాసముంటున్న మొల్లి శ్రీను… 14 ఏళ్ల అను, 10 ఏళ్ల చరణ్‌కు విషం కలిపిన బాదం పాలు ఇచ్చాడు.
వాటిని ఎంతో ఇష్టంగా తాగిన అను, చరణ్.. వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు ఈ విషయం గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుటుంబంలోని ఆర్థిక వ్యవహారాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంతోనే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మొల్లి శ్రీను విషం కలిపిన బాదం పాలను తన కొడుకు, కూతురుకు తాగించాడు. ఈ క్రమంలో వారంతా కూడా స్పృహ తప్పిపడిపోయారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఎందుకు పిల్లలకు విషం తాగించాల్సి వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు.