విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్నిప్రమాదం..మూడు స్కూల్‌ బస్సులు దగ్ధం

విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్నిప్రమాదం..మూడు స్కూల్‌ బస్సులు దగ్ధం

Updated On : January 28, 2021 / 10:16 AM IST

Three school buses burnt : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. నిలిపి ఉంచిన ఓ బస్సులో తెల్లవారుజామున మంటలు రేగాయి. ఎవరూ గమనించకపోవడంతో మంటలు మరో రెండు బస్సులకు అంటుకున్నాయి.

దీంతో స్థానికులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. పెందుర్తిలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో కొత్తవలస, విశాఖ నుంచి ఫైర్‌ ఇంజన్లు రప్పించారు. ఈలోపు మంటలకు మూడు బస్సులు దగ్ధమయ్యాయి. మంటలు ఎలా చేలరేగాయి అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆగి ఉన్న బస్సులో నిప్పులు చేలరేగడంతో ఎవరైనా అంటించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్‌లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది.