Chandrababu : చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్.. ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడుసార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని.. Chandrababu Mulakat

Chandrababu : చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్.. ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు

Chandrababu Mulakat

Chandrababu Mulakat : చంద్రబాబు లీగల్ ములాఖత్ ల సంఖ్య పెంచాలంటూ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్ లో ప్రతివాదులను చేర్చాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించారు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. వివిధ కేసుల్లో విచారణ ఉన్నందున లీగల్ ములాఖత్ ల సంఖ్యను రోజుకు మూడుసార్లకు పెంచాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదుల పేర్లను చేరుస్తామని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో ములాఖత్ కు అవకాశం ఉంది.

లీగల్ ములాఖత్ ల సంఖ్యను మూడుకు పెంచాలని చంద్రబాబు లాయర్లు నిన్న ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో పిటిషన్ ను తోసిపుచ్చారు.

Also Read : ప్రభుత్వ వైద్య పరీక్షలు, రిపోర్టులపై నమ్మకం లేదు- చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా

ప్రస్తుతం చంద్రబాబును కలిసేందుకు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు రాజమండ్రి జైలు అధికారులు. కాగా, రోజుకు కనీసం మూడు సార్లు చంద్రబాబుని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు లాయర్లు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడుసార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, భద్రతా కారణాలతో ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని, దీని వల్ల ఇబ్బంది అవుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లీగల్ ములాఖత్ సంఖ్య పెంపుపై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదంది. దీంతో మరోసారి ఈ విషయమై కోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు లాయర్లు నిర్ణయించారు.

Also Read : దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో కూడా చంద్రబాబు పేర్లున్నాయి.