Actor Prudhvi Raj : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలని వైసీపీ నేతలను పృథ్వీ ప్రశ్నించారు. రోజాలాంటి బూతుల మంత్రులు,...

Actor Prudhvi Raj : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Actor Prudhvi Raj

Updated On : January 23, 2024 / 2:26 PM IST

Janasena Party Leader Prudhvi Raj : ఏపీలో టీడీపీ, జనసేన రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమని సినీనటుడు, జనసేన నేత పృథ్వీ అన్నారు. 130 స్థానాలతో టీడీపీ – జనసేన కూటమి మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీలపై పృథ్వీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు.. ఆ బాణం వల్ల వైసీపీ వారికి ఏం జరుగుతుందో చూడాలంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు.

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకోసం వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మార్పులు చేర్పులు చేస్తున్న విషయంపై పృథ్వీరాజ్ స్పందించారు. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరోచోట తీసుకెళ్లి నిలిపితే ఓటు ఎవరు వేస్తారు? 175కు 175 సీట్లు మీరు గెలుస్తామన్నప్పుడు భయం ఎందుకు? ఈ మార్పులు ఎందుకు అంటూ పృథ్వీరాజ్ ప్రశ్నించారు. నేను సినిమాలో చేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశానని అన్నారు. రోడ్లమీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏమిటి అంటూ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్థానాలతో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

Also Read : DSC Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

చంద్రబాబు, పవన్ కల్యాణ్ వదిలిన బాణం పృథ్వీరాజ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలని వైసీపీ నేతలను పృథ్వీ ప్రశ్నించారు. రోజాలాంటి బూతుల మంత్రులు కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఏపీలో ఒక్క రాజధాని లేదు. ఇక మూడు రాజధానులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు. ఎన్నికలు మొదలవుతున్నాయి.. ప్రచారానికి వస్తాను.. ఒక్కొక్కరి దుమ్ము దుపుతా.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ నన్ను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తా.. ఎవరి జాతకం ఏంటనేది నా దగ్గర ఉందంటూ పృథ్వీరాజ్ హెచ్చరించారు. లోకేశ్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు నా దగ్గర కూడా ఓ పీఆర్ డైరీ ఉంది.. అందులో అందరి జాతకాలు ఉన్నాయంటూ జనసేన నేత పృథ్వీరాజ్ అన్నారు.