12 ఏళ్ల తర్వాత : ఆయేషా మీరా రీ పోస్టుమార్టం కంప్లీట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం
గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు పోస్టుమార్టం చేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఆయేషాకు రీపోస్టుమార్టం నిర్వహించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెను చంపేశారు.
ఆయేషా మీరా హత్యాచారం కేసులో పోలీసులు.. మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావటంతో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీ- పోస్టుమార్టం చేశారు.
సీబీఐ ద్వారా తన బిడ్డకు న్యాయం జరుతుందని అశిస్తున్నామన్నారు ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం. దేశంలో ఆయేషామీరాకు జరిగినంత అన్యాయం మరే మహిళలకు జరగలేదన్నారు. ఆయేషా మీరాకు న్యాయం జరగాలని దేశంలోని మహిళలంతా ఎదురుచూస్తుర్నారని అన్నారమె.
Read More : నిద్రిస్తున్న బాలికపై అత్యాచారం