Nara Lokesh : ముగిసిన సీఐడీ విచారణ.. మళ్లీ ఢిల్లీకి నారా లోకేశ్

మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరితే కనుక.. న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో లోకేశ్ ఉన్నారు. Nara Lokesh

Nara Lokesh : ముగిసిన సీఐడీ విచారణ.. మళ్లీ ఢిల్లీకి నారా లోకేశ్

Nara Lokesh Back To Delhi

Updated On : October 12, 2023 / 12:14 AM IST

Nara Lokesh To Go Delhi : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ రెండు రోజుల సీఐడీ విచారణ ముగిసింది. రెండు రోజుల సీఐడీ విచారణకు తాను సహకరించానని లోకేశ్ తెలిపారు. అయితే, రేపటి విచారణపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నారు. హైకోర్టు ఒకరోజు విచారణకు పర్మిషన్ ఇస్తే సీఐడీ అధికారులు రెండు రోజుల విచారణకు పిలిచినా తాను సహకరించానని లోకేశ్ వెల్లడించారు. తన శాఖకు సంబంధం లేదని ప్రశ్నలు అడిగారని అన్నారు. ఇక, నారా లోకేశ్ మళ్లీ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇస్తే లోకేశ్ కోర్టుని ఆశ్రయించే ఛాన్స్ ఉంది.

మరోసారి విచారణకు పిలుస్తారా?
మరోసారి విచారణకు రావాలా? వద్దా? అన్న దానిపై సీఐడీ అధికారులు నారా లోకేశ్ కు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, రెండురోజుల విచారణ ముగియడంతో మరోసారి ఢిల్లీ వెళ్లే యోచనలో నారా లోకేశ్ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ రెండు రోజులు కాకుండా మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరితే కనుక.. న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో లోకేశ్ ఉన్నారు. దీనికి సంబంధించి నారా లోకేశ్ న్యాయనిపుణులతో కూడా మాట్లాడుతున్నారు.

Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌ రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో లోకేశ్:
ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, లోకేశ్ ను 12వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. 12వ తేదీ తర్వాత లోకేశ్ ను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులతో మాట్లాడేందుకు లోకేశ్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఒక పక్క తన కేసు చూసుకుంటూ మరోపక్క చంద్రబాబు వ్యవహారాలు ఢిల్లీలో చూసుకునేందుకు లోకేశ్ హస్తినకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. కాగా, మరోసారి విచారణకు లోకేశ్ రావాలా వద్దా అనేదానిపై సీఐడీ అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.