సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తొలి సంతకం దీనిపైనే..!

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉంది.

సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తొలి సంతకం దీనిపైనే..!

Updated On : June 12, 2024 / 11:28 AM IST

Chandrababu First Signature : ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఉదయం 11గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం దేనిపై ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక రాజకీయాల్లో హీట్ పెంచిన తీవ్ర వివాదాస్పదమైన.. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు తన రెండో సంతకం చేసే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారం తర్వాత మూడు సంతకాలతో పాటు పలు కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకునే ఛాన్స్ ఉంది. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, రైతుకు రూ.20వేల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అమలుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక, ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు మంజూరు వంటి కీలక డెసిషన్లు తీసుకునే ఛాన్స్ ఉంది.

Also Read : ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?