Airplane Stuck Under Bridge: అయ్యయ్యో ఎంత పనైంది! బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం..
హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.

Airplane Stuck Under Bridge
Airplane Stuck Under Bridge: గాల్లో ఎగరాల్సిన విమానం బ్రిడ్జికింద ఇరుక్కుపోయింది. దానిని తీసేందుకు సిబ్బంది నానా తంటాలు పడగా.. స్థానికులు మాత్రం ఇలాంటి దృశ్యం మరోసారి ఆవిష్కృతం కాదంటూ ఫొటోలను సెల్ ఫోన్‌లలో బంధించారు. కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున ట్రాలీ లారీపై వస్తున్న విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలనే వినూత్న ఆలోచనలో దీనిని కొనుగోలు చేసింది. కొచ్చిన్‌లో పాత విమానాన్ని కొనుగోలు చేసి అక్కడే హోటల్‌గా మార్పులు చేసింది. అనంతరం రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
Facebook Friend: ఫేస్‌బుక్ ప్రేమికుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత.. యూపీలో దారుణహత్య..
ట్రాలీ లారీ బ్రిడ్జి కింద నిలిచిపోవటంతో ఆ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత పోలీసులు వేరే మార్గానికి వాహనదారులను దారి మళ్లించారు. అనంతరం విమానాన్ని జాగ్రత్తగా అండర్ పాస్ బ్రిడ్జి దాటించే ప్రయత్నం చేశారు.