Minister Adimulapu suresh : మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలం ఆక్రమించారంటూ.. బాలినేని వద్దకు బాధితులు
మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు.

Minister Adimulapu suresh..Balineni Srinivasa Reddy
Minister Adimulapu ..Balineni Srinivasa Reddy : మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలినేనికి విన్నవించుకుంది సదరు బాధితురాలు. దయచేసిన తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో బాలినేని బాధితుల కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణిం వారికి న్యాయం చేయాలని బాలినేని కలెక్టర్ కు సూచించారు.
కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విభేధాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేశ్ మధ్య విభేదాలు ఉన్నాయి. మంత్రి పదవి నుంచి బాలినేని తొలగించనప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో ఆయన తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో పార్టీ తనకు అప్పగించిన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఇటీవల బాలినేని రాజీనామా చేశారు. కానీ బాలినేని సీఎం జగన్ కు బంధువు. అయినా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించటం హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. మంత్రి పదవి నుంచి తొలగించటంపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈక్రమంలో జరిగిన పలు కీలక పరిణామాలతో పార్టీ తనకు అప్పగించిన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఇటీవల బాలినేని రాజీనామా చేశారు. అయినా బాలినేని డీఎస్పీ నియామకంలో తన పంతం నెగ్గించుకున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ కు బాలినేనికి మధ్య విభేధాలు లేవను చెబుతున్నా..అవి అంతర్గతంగా కొనసాగుతునే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో మంత్రి ఆదిమూలపు వల్ల తమ భూమి కబ్జాకు గురి అయ్యిందని వాపోతు బాలినేని వద్దకు బాధితులు రావటం న్యాయం చేయమని కోరటం చూస్తుంటే వారి మధ్య విభేధాలు కొనసాగుతున్నట్లే తెలుస్తోంది.