Minister Gudivada Amarnath: నాపై ఆరోపణలు నిరూపించలేక‌పోతే.. లోకేశ్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తావా చంద్రబాబు?

ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాల పేరుతో మరో కొత్తడ్రామాకు చంద్రబాబు తెరలేపారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

Minister Gudivada Amarnath: నాపై ఆరోపణలు నిరూపించలేక‌పోతే.. లోకేశ్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తావా చంద్రబాబు?

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించు.. ఒకవేళ నిరూపించలేకపోతే లోకేశ్‍ను రాజకీయాల నుండి తప్పిస్తావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై కోపం ఉందని, నువ్వు ఏం చేసినా ప్రజలు జగన్ పక్షానే ఉంటారని అమరాథ్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.

Minister Gudivada Amarnath: చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అమర్‌నాథ్ సెటైరికల్ ట్వీట్

విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారు?, ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తాడని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90శాతం విజయం సాధించిందని గుర్తుచేశారు. ఎన్టీరామారావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ, చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం అంటూ మంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘగర్ ఫ్యాక్టరీలను మూయించినది ఎవ్వరు? ఘగర్ ఫ్యాక్టరీలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu : పెద్ద నోట్లు రద్దు చేయాలని అప్పుడే చెప్పా

ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాల పేరుతో మరో కొత్తడ్రామాకు చంద్రబాబు తెరలేపారని, అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబుకు గుర్తుకు రాదుకానీ.. అధికారం కోల్పోయిన తరువాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. విస్సన్నపేట గ్రామంలో 609ఎకరాల భూమి నేను కాజేసినట్లుగా నిన్న చంద్రబాబు విమర్శలు చేశారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి నా పేరున కానీ, నా కుటుంబ సభ్యుల పేరిట ఉన్నా నేను రాజకీయాలు నుండి తప్పుకుంటానని అన్నారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే లోకేష్‌ను రాజకీయాలు నుండి తప్పిస్తావా చంద్రబాబు అంటూ మంత్రి సవాల్ విసిరారు. నీ కొడుకులాగా సందులో నుంచి నేను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.