Minister Gudivada Amarnath: చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అమర్‌నాథ్ సెటైరికల్ ట్వీట్

చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Minister Gudivada Amarnath: చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అమర్‌నాథ్ సెటైరికల్ ట్వీట్

Minister amar Nath

Updated On : January 8, 2023 / 1:15 PM IST

Minister Gudivada Amarnath: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వీరు భేటీ అయ్యారు. వీరి మధ్య ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చజరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరి భేటీపై అధికార పార్టీ నేతలు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు, పవన్ భేటీపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

Minister Amarnath: బాలయ్య బాబు కాదు… బాలయ్య తాత అనాలి: మంత్రి అమర్‌నాథ్

చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మంత్రికి కౌంటర్‌గా ట్విటర్‌లో రిప్లై ఇస్తున్నారు. ఓ నెటిజన్ ‘మనలో మన మాట.. నీకు మాముళ్లు అందేసిందా బాబాయి నా యాజమాని దగ్గర నుంచి, అప్పుడే వచ్చి మొరుగుతున్నావ్’  అంటూ మంత్రి అమర్నాథ్‌‌కు  కౌంటర్ ఇచ్చారు.

 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1పై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై పవన్, చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.