రాజధాని రగడ 22వ రోజు : టెంట్ వేస్తే..అడ్డుకున్న కాప్స్

అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డుపై ఎండలోనే కూర్చొని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులు అడ్డం పెట్టుకొని వృద్ధులు, మహిళలు ఎండలోనే మహా ధర్నా కొనసాగిస్తున్నారు.
మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO ఇచ్చిన నివేదికపై రాజధాని వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి జరిగింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. గన్ మెన్‌పై దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతే రాజధానిగా ఉండాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వారిని శాంతింప చేసేందుక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విఫలమౌతున్నాయి. ప్రభుత్వం దీనిపై హై పవర్ కమిటీని నియమించింది. రాజధాని అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
Read More : ఆవేశంగా మాట్లాడుతూ..మధ్యలోనే ప్రసంగం ఆపేసిన నారా లోకేష్..ఎందుకు