తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె ఉండవచ్చని ల్యాబ్..

తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

Ambati Rambabu

Updated On : September 21, 2024 / 6:58 PM IST

తిరుమల లడ్డూపై చెలరేగుతున్న వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయ కక్ష సాధింపు కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద బురద చల్లాలని చూస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ వల్లే తప్పులు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. శ్రీ వారి లడ్డూలో కల్తీ ఉందని నిరూపించాలని చెప్పారు. పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె ఉండవచ్చని ల్యాబ్ అనుమానం వ్యక్తం చేసిందని పేపర్‌లో వచ్చిందని తెలిపారు. నిరూపణ అయితే చర్యలు తీసుకోవాలని అన్నారు.

నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ల్యాబ్‌లో టెస్ట్ చేశారని కచ్చితత్వం మీద వారికే డౌట్ వచ్చిందని తెలిపారు. కోట్లమంది లడ్డూలు తిన్నారని, కల్తీ జరిగిందని నిరూపించాలని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని, జగన్ మీద కక్ష ఉంటే ఇంకోకరకంగా తీర్చుకోవాలని చెప్పారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు హయాంలోనే గదా శాంపిల్స్ తీసిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి సపోర్ట్ కోసం అధికారులు నానా తంటాలు పడుతున్నారని అన్నారు.

ఇలా జరగడం పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం: మోహన్ బాబు