Ambati Rambabu: అందుకే పవన్ కల్యాణ్ ‘యువగళం ముగింపు సభ’కు వచ్చారు: మంత్రి అంబటి
లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఎందుకంటే..

Ambati Rambabu
Yuvagalam: టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర, ముగింపు సభ అట్టర్ ప్లాప్ అయ్యాయంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అసలు యువగళం పాదయాత్ర ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు- పవన్ కల్యాణ్ కలుస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదని అన్నారు. టీడీపీని బలోపేతం చేసేందుకే జనసేన ఉందని ఆరోపించారు.
జనసేన ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ప్యాకేజ్ మాట్లాడుకుని పవన్ యువగళం సభకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు -పవన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేవని అన్నారు. ఇక్కడ కనీసం ఇల్లులేని వారిని మాటలను ప్రజలు నమ్మబోరని చెప్పారు.
చంద్రబాబు, పవన్, లోకేశ్, బాలకృష్ణ ఏకమైనా జగన్‌ను ఎమీ చేయలేరని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు వయస్సు అయిపోయిందని, అందుకే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తపన పడుతున్నారని చెప్పారు.
Ushashri Charan: సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి: మంత్రి ఉషశ్రీ