పవన్ కల్యాణ్ 11 రోజుల దీక్ష.. వైసీపీ ఆఫీసుపై దాడిపై అంబటి రాంబాబు కామెంట్స్

పవన్ కల్యాణ్ నానా హంగామా చేస్తున్నారని చెప్పారు. జగన్‌ను నిందించడం కోసం..

పవన్ కల్యాణ్ 11 రోజుల దీక్ష.. వైసీపీ ఆఫీసుపై దాడిపై అంబటి రాంబాబు కామెంట్స్

Ambati Rambabu

Updated On : September 22, 2024 / 2:45 PM IST

Ambati Rambabu: వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీక్ష చెయ్యాల్సింది పవన్ కాదని చంద్రబాబు చెయ్యాలని అన్నారు. అసత్య ఆరోపణలు చేశాను క్షమించు అని దీక్ష చెయ్యాలని అన్నారు. దీక్షలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని, దుర్మార్గమైన రాజకీయం చేస్తూ దీక్షలు చేస్తే దేవుడు క్షమించడని చెప్పారు.

బీజేపీ ఒక పక్క హడావుడి చేస్తుంటే మరోపక్క పవన్ కల్యాణ్ నానా హంగామా చేస్తున్నారని చెప్పారు. జగన్‌ను నిందించడం కోసం తిరుమల ప్రతిష్ఠతను దిగజారుస్తున్నారని అన్నారు. శ్యామలరావు నియామకం రోజునే ఈ కుట్రకు పునాది వేశారని, మూడు పార్టీలు కలిసి ఈ కుట్ర చేశాయని ఆరోపించారు.

టీటీడీ లడ్డూ వ్యవహారంపై తాము అనేక ప్రశ్నలు అడుగుతున్నామని, వాటికి సర్కారు సమాధానం చెప్పడం లేదని అన్నారు. జులై 23న అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమేనని, లడ్డూ గురించి రిపోర్టు వచ్చిన రెండు నెలలకు చంద్రబాబు బయటకి చెప్పారని తెలిపారు. ఆ రిపోర్టులో జంతువులు కొవ్వు ఉన్నట్లు లేదని, లేనివి అనట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీబీఐ విచారణకు అదేశించండని అంటే సమాధానం లేదని అన్నారు.

విశాఖలో స్టీల్ ప్లాంట్ తీసేస్తున్నారని కార్మికుల తిరుగుబాటు మొదలైందని, అక్కడ కార్మికులు ఆందోళనలు చేస్తుంటే డైవర్షన్ కోసం తమ కార్యాలయంపై దాడి చేశారని చెప్పారు. తయారైన లడ్డూల్లో ఎలాంటి కల్తీ జరగలేదని, వాడిన నెయ్యిలో ఎక్కడా కల్తీ లేదని అన్నారు. ఒకవేళ ఉంటే చూపించాలని, తిరుమలకు వచ్చిన లారీల్లో మాత్రమే శాంపిల్స్ తీశారని, రిజెక్ట్ అయితే వెనక్కి పంపారని అంబటి రాంబాబు తెలిపారు.

YS Jagan : తిరుపతి లడ్డూ వివాదం.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ.. ఏమన్నారంటే..?