Ambati Rayudu: జనంలోకి అంబటి రాయుడు.. పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ప్రకటన

క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రజలతో మమేకవుతున్నాడు. గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.

Ambati Rayudu: జనంలోకి అంబటి రాయుడు.. పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ప్రకటన

Ambati Rayudu visit guntur district

Ambati Rayudu Political Entry : టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ గేమ్(Political Game) కి పిచ్ రెడీ చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే అతడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే రాయుడు మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేనని అంటూ సమాధానం దాటవేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని అంటున్నారు. గుంటూరు(Guntur) ఎంపీగా పోటీ చేయబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అలాంటిదేమి లేదని బదులిచ్చాడు.

తాజాగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నాడు అంబటి రాయుడు. గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంతో పాటు ఫిరంగిపురంలో ముందుగా పర్యటించారు. స్థానిక ప్రార్థనాలయాలను సందర్శించి మత పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల్లో వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read: టీడీపీలో చేరిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్..

తెనాలి రూరల్ మండలం కొలకలూరులో తర్వాతి రోజు పర్యటించారు. రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)ను సందర్శించి రైతులతో మాట్లాడారు. సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యారు. తన తాతను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చానని ఈ సందర్భంగా రాయుడు తెలిపాడు. ఏపీలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని, దీని గురించే ఇటీవల సీఎం జగన్ ను కలిసినట్టు చెప్పాడు. పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని మీడియాకు తెలిపాడు.

Also Read: పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు.. లోకేష్ పాదయాత్రపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు