ఎన్నికల తర్వాత అందుకే గొడవలకు దిగుతున్నారు: వైసీపీ నేతలు
YCP Leaders: ట్రాన్స్‌ఫర్ జరిగిన చోట మాత్రమే గొడవలు జరిగాయని తెలిపారు. ఎన్నికల రోజే పెద్దారెడ్డి వాహనాలపై..

Anantha Venkatarami Reddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చోటుచేసుకున్న ఘర్షణపై జిల్లా వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంత వెంటరామిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎన్నికల రోజు నుంచి ఒక ఎత్తుగడగా గొడవలకు దిగుతున్నారని చెప్పారు.
పోలీసులను ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా గొడవల కోసం వేసిన ఎత్తుగడేనని అన్నారు. ట్రాన్స్‌ఫర్ జరిగిన చోట మాత్రమే గొడవలు జరిగాయని తెలిపారు. ఎన్నికల రోజే పెద్దారెడ్డి వాహనాలపై దాడి జరిగిందని అన్నారు. పెద్దారెడ్డి ఎన్నికల రోజు ఎక్కడికి వెళ్లినా జేసీ ప్రభాకర్ రెడ్డి రావడం, ఆయన వెనకాలే ఏఎస్పీ రామకృష్ణ రావడం అందులో భాగమేనని చెప్పారు.
జేసీ ప్రభాకర్ అనుచరులు పెద్దారెడ్డి ఇంటిపై దాడులు చేసేందుకు ట్రాక్టర్లతో బండరాళ్లు తొవ్వారని చెప్పారు. పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు దూరి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరుతున్నట్లు చెప్పారు.
ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాగైనా సరే గెలవాలని చంద్రబాబు కూటమి కుట్రలు పన్నిందని చెప్పారు. ఆయా ప్రాంతాల పైన అవగాహన లేని అధికారులను ఎన్నికల వేళ నియమించారని అన్నారు. పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన దాడి గమనిస్తే పోలీసులే దాడికి ప్రేరేపించినట్టు అనుమానం కలుగుతుందని తెలిపారు.
Also Read: నిజామాబాద్‌లో గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమాన్యుడినని: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి: