Ambati Rambabu: యువగళం మీటింగ్‌లో యాంకర్ ఉదయ భాను .. అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్..

లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉదయ భాను పాల్గొనడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu: యువగళం మీటింగ్‌లో యాంకర్ ఉదయ భాను .. అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్..

Ambati Rambabu

Updated On : July 28, 2023 / 11:06 AM IST

Yuva Galam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా పలు వర్గాల ప్రజలతో లోకేశ్ సమావేశం అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమావేశంలో పాల్గొనే ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు లోకేశ్ వివరిస్తున్నారు. తాజాగా యువగళం పాదయాత్ర ఒంగోలు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో నారా లోకేశ్ పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉదయభాను ‘జయహో బీసీ’ సదస్సులో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరువలో పాదయాత్ర

జయహో బీసీ సదస్సులో ఉదయభాను మాట్లాడారు.. ఇవాళ మీ అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. మీలాగా మీవంటి కుటుంబాల్లో నుంచే వచ్చాను. నాకు ప్రతి కన్నీటి చుక్క విలువ తెలుసు అంటూ ఉదయభాను అన్నారు. ఈ  సదస్సులో పలు విషయాలపై ఆమె మాట్లాడారు. అనంతరం ప్రజల తరుపున లోకేశ్‌ను పలు అంశాలపై ఉదయభాను ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తున్న ఉదయభాను ఒక్కసారిగా లోకేశ్ యువగళం పాదయాత్ర‌లో భాగంగా నిర్వహించిన జయహో బీసీ సదస్సులో పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉదయభాను లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా జయహో బీసీ సదస్సుకు యాంకర్‌గా వ్యవహరించడంపట్ల పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.

Nara Lokesh: బాబాయిని ఎవరు చంపారో సీబీఐ తాజా చార్జిషీట్‌తో తెలిసిపోయింది: నారా లోకేశ్

లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన జయహో బీసీ సదస్సుకు ఉదయ భాను యాంకర్‌గా వ్యవహరించడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ట్విటర్ వేదికగా.. పాపం.. ‘యువగళం’కి ఉదయభాను యాంకరింగ్ కావాల్సి వచ్చింది! అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ శ్రేణులు అంబటి ట్వీట్‌కు మద్దతుగా రీ ట్వీట్లు చేస్తుండగా.. తెదేపా శ్రేణులు అంబటి రాంబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.