AP Growth Rate : వృద్ధి రేటులో దుమ్మురేపిన ఏపీ.. దేశంలోనే రెండో స్థానం.. సీఎం చంద్రబాబు హర్షం..

ఎనర్జీ, పరిశ్రమలు, సేవా రంగం, ఇంధనం.. వీటన్నింటిలో తాము తీసుకొచ్చిన కొత్త పాలసీల వల్లే గ్రోత్ రేట్ లో ముందుకు రావడం జరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు.

AP Growth Rate : వృద్ధి రేటులో దుమ్మురేపిన ఏపీ.. దేశంలోనే రెండో స్థానం.. సీఎం చంద్రబాబు హర్షం..

Updated On : April 6, 2025 / 9:15 PM IST

AP Growth Rate : వృద్ధి రేటు రాష్ట్రాల్లో ఏపీ టాప్ లిస్టులోకి వచ్చింది. 2024-25 సంవత్సరానికి వృద్ధి రేటులో ఏపీకి రెండో స్థానం లభించింది. కాన్ స్టెంట్ ప్రైసెస్ లో 8.21 శాతం వృద్ధి సాధించింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో ఏపీ సెకండ్ ప్లేస్ లోకి రావడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సెకండ్ ప్లేస్ వచ్చిందని తెలిపారు. ఇది ప్రజల సమిష్టి విజయం అన్నారు చంద్రబాబు.

గ్రోత్ రేట్ లో గతంలో ఏపీ 6.19 శాతం ఉండేది. ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం విశేషం. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే 2.02శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. ఎనర్జీ, పరిశ్రమలు, సేవా రంగం, ఇంధనం.. వీటన్నింటిలో తాము తీసుకొచ్చిన కొత్త పాలసీల వల్లే గ్రోత్ రేట్ లో ముందుకు రావడం జరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు.

Also Read : రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి కారణం అదేనా?

మరోవైపు 9.69 శాతంతో గ్రోత్ రేట్ లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఒకవైపు తమిళనాడు, మరోవైపు ఏపీ.. రెండూ దక్షిణాది రాష్ట్రాలే కావడం విశేషం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం గాడిన పడిందని, ఇది కాన్ఫిడెన్స్ పెంచే విధంగా వృద్ధి రేటు ఉందని చంద్రబాబు అన్నారు. బంగారు భవిష్యత్తు కోసం అందరం కలిసి నడుద్దాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2024-25 సంవత్సరానికి భారతదేశంలో 8.21శాతం వృద్ధి రేటుతో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ సాధించింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 2011-12 సంవత్సరం ఆధారంగా స్థిర ధరల వద్ద, ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) రూ. 8,65,013 కోట్లకు చేరుకుంది. ఇది 2023-24లో రూ. 7,99,400 కోట్ల నుండి పెరిగింది. 2023-24లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 6.19%.

ఆంధ్రప్రదేశ్ వృద్ధికి దాని బలమైన వ్యవసాయం, తయారీ, సేవల రంగాలు కారణమని చెప్పొచ్చు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRA) అమల్లో కూడా రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది.

Also Read : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..

భారతదేశంలో వ్యాపార సౌలభ్య సూచికలో రాష్ట్రం స్థిరంగా ఉన్నత స్థానంలో ఉంది. క్రమబద్ధీకరించబడిన విధానాలు, పారదర్శక నిబంధనలు, పెట్టుబడిదారుల-కేంద్రీకృత విధానాల ద్వారా వ్యాపార అనుకూల వాతావరణానికి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 15% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యుత్తమంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. జూన్ 2024లో నాలుగోసారి అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. కీలక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.