Somu Veerraju: హాఫ్ టీ సరిపోదు.. పవన్ కళ్యాణ్‌కి సోము వీర్రాజు సూచన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కీలకమైన సూచన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

Somu Veerraju: హాఫ్ టీ సరిపోదు.. పవన్ కళ్యాణ్‌కి సోము వీర్రాజు సూచన

Somu Veerraju

Updated On : December 29, 2021 / 12:55 PM IST

Somu Veerraju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కీలకమైన సూచన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోరాటంలో హాఫ్ టీ ఉంటే సరిపోదని, ఫుల్ టీ అవసరం అని అన్నారు సోము వీర్రాజు.

స్టీల్ ప్లాంట్ ఒక్కదాని కోసమే పవన్ పోరాడితే సరిపోదని, మూతపడిన కర్మాగారాలు ఎన్నో ఉన్నాయని,
వాటిపై జనసేన పోరాటం చేస్తే బీజేపీ కలిసి వస్తుందని అన్నారు. జనసేన, బీజేపీ మిత్రపక్షాలు అనడంలో ఏ మాత్రం డౌట్ లేదని మరోసారి పునరుద్ఘాటించారు సోమువీర్రాజు.

ఇదే సమయంలో ఏపీలో మద్యం రేట్లు పెంచి ప్రభుత్వం పేదల రక్తం తాగుతుందని అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తాము అధికారంలోకి వస్తే, మద్యం రేట్లను తగ్గిస్తామని అన్నారు.

తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది ఆడుపడుచుల కోసమేనని, తాగేవారు వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమే ఈ ప్రకటన చేసినట్లు చెప్పారు. ‘‘పేదవాడి కోసం ఆలోచించి నేను మద్యం కోసం మాట్లాడాను.. నేను పేదల పక్షపాతిని’’ అని సోమువీర్రాజు అన్నారు.