AP PRC : ఏపీ ఉద్యోగులకు తీపి కబురు..పది రోజుల్లో పీఆర్సీ

పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

AP PRC : ఏపీ ఉద్యోగులకు తీపి కబురు..పది రోజుల్లో పీఆర్సీ

Prc

Updated On : December 3, 2021 / 10:57 AM IST

AP Govt Employees PRC : వరదలకు కకావికలమైన చిత్తూరు జిల్లా తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. ఈ సందర్భంగా…ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలిశారు. పీఆర్సీ..తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Read More : President Ram Nath Kovind : శీతాకాల విడిది కోసం ఈనెలాఖరున హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

గత కొన్ని రోజులుగా పీఆర్సీ, తదితర డిమాండ్స్ పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు ఏకమయ్యారు. ప్రభుత్వంపై వత్తిడి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు కూడా. పీఆర్సీ నివేదిక అడిగినా..ఇంతవరకూ ఇవ్వలేదని, ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 01వ తేదీన సీఎస్ కు వినతిపత్రం ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి 10 వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. అయితే..సీఎం జగన్ ను కలిసిన తర్వాత..పీఆర్సీ ప్రకటనపై రావడంతో…ముందుగానే వెల్లడించినట్లుగా కార్యాక్రమాలు నిర్వహిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Read More : Mom Doctor: తల్లిని ట్రీట్ చేసిన డాక్టర్‌పై కేసు.. రూ.కోట్లు గెలుచుకున్న మహిళ

మరోవైపు…వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలానికి  వెళ్తారు. అక్కడ వరద కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలను సీఎం పరిశీలిస్తారు. ఆ తర్వాత బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ, పెనుబల్లి ప్రాంతాల్లో .. వరద నష్టాన్ని పరిశీలిస్తారు. రైతులతో సమావేశమయ్యి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పెనుబల్లి నుంచి నేరుగా .. నెల్లూరులోని  భగత్‌సింగ్‌ కాలనీకి చేరుకుని.. బాధిత కుటుంబాలతో జగన్‌ మాట్లాడుతారు.