కొడాలి నాని, వంశీ, రోజా, అంబటి ఓడిపోయే అవకాశం.. రైజ్ సర్వే సంస్థ అంచనా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోబోతున్నారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

కొడాలి నాని, వంశీ, రోజా, అంబటి ఓడిపోయే అవకాశం.. రైజ్ సర్వే సంస్థ అంచనా

Updated On : June 1, 2024 / 7:42 PM IST

AP election 2024 exit poll result: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోబోతున్నారని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఏపీ ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు కొంత మంది మినిస్టర్లకు ఓటమి తప్పదని రైజ్ సర్వే సంస్థ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఆ సంస్థ సీఈవో ప్రవీణ్ శ్రీకాకుళం జిల్లాలో శనివారం సాయంత్రం వెల్లడించారు. మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు ఓటమిపాలయ్యే అవకాశం ఉందన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్ పరాజయం పాలయ్యే అవకాశముందని తెలిపారు. ఎంపీలుగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ షర్మిల సైతం ఓడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని రైజ్ సీఈవో ప్రవీణ్ వెల్లడించారు. ”కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో 99% యక్యూరేట్ రిజల్ట్ ఇచ్చాం. ఏపీలో పోస్ట్ పోల్ సర్వే చేశాం. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. అభివృద్ధి లేమి, విద్యుత్ చార్జీలు ప్రభావం చూపాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత ప్రభావం చూపింది. పోస్టల్ బ్యాలెట్ లో 75-80% మంది ఓటర్లు కూటమికి ఓటేశారు. టీడీపీ కేడర్ కంటే జనసేన యువత ఎక్కువ కష్టపడ్డార”ని తెలిపారు.

Also Read: ఏపీలో కూటమిదే జయకేతనం..! పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంచలన రిపోర్ట్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనా
కూటమి 113-120
వైసీపీ 48-60
ఇతరులు 0-1

కూటమిలో ఎవరెన్ని గెలుస్తారంటే?
టీడీపీ 92-98
జనసేన11-16
బీజేపీ 0-3