Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు .. ద్రవంలో పడిపోయిన 9మంది ఉద్యోగులు
విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది ఉద్యోగులు ద్రవంలో పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు.

Visakha Steel Plant
Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది ఉద్యోగులు ద్రవంలో పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు. శనివారం (ఫిబ్రవరి 11,2023) SMS- 2 లిక్విడ్ (SMS-2 Liquid) విభాగంలో పేలుడు ఘటనలో తొమ్మిదిమంది ఉధ్యోగులు ద్రవంలో పడిపోయారు. మరికొందరు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే వారిని స్టీల్ ప్లాంట్ లోని ఆస్పత్రికి తరలించింది చికిత్సనందిస్తున్నారు. మరికొంతమందిని గాజువాకలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఫ్లాగ్ యాష్ ను, తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో తొమ్మిదిమంది ద్రవంలో పడిపోయారు. గాయపడినవారిలో 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి (Seven Hills Hospital)కి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిలో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా..ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. ద్రవరూపంలో ఉండే ఉక్కును నిల్వ చేసే క్రమంలో సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ సేఫ్టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ యజమాన్యం చెబుతోంది.