Gudivada Amarnath : జగన్ సైన్యంలో నేనొక సైనికుడిని.. ఎటువంటి త్యాగానికైనా సిద్ధం : మంత్రి అమర్నాథ్ కామెంట్స్

జగన్‌కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని ఒదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు.

Gudivada Amarnath : జగన్ సైన్యంలో నేనొక సైనికుడిని.. ఎటువంటి త్యాగానికైనా సిద్ధం : మంత్రి అమర్నాథ్ కామెంట్స్

Andhra Pradesh Minister Gudivada

Updated On : February 4, 2024 / 7:10 PM IST

AP Minister Gudivada Amarnath Comments : ‘అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగనే సీఎం కావాలని ఆకాంక్షించిన ఆయన అవసరం అయితే ఎటువంటి త్యాగానికి అయినా తాను సిద్ధమన్నారు.

Read Also : AP Politics: 3 గంటల పాటు వీటిపై చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆ తర్వాత..

ఆదివారం ఇక్కడ విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్‌కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని ఒదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు. జగన్ సైన్యంలో అమర్నాధ్ ఒక సైనికుడని ఆయన తనకు అనేక పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర సంబంధాలే తప్పా రాజకీయ సంబంధాలు లేవు :
రైల్వే జోన్ కి సంబంధించిన భూమి కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తుందని విమర్శించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలను పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మధ్య రాష్ట్ర సంబంధాలే ఉంటాయి తప్పా రాజకీయ సంబంధాలు లేవని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వలు కన్నా గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశామని, 90 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

తహసీల్దారు రమణయ్య హత్య ఘటన దురదృష్టకరం :
రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్‌‌ను తాకట్టు పెట్టదన్నారు. ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీతో తప్పితే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. తహసీల్దారు రమణయ్య హత్య ఘటన చాలా దురదృష్టమని అన్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్య కేసులో విచారణ జరుగుతుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.

Read Also : Chiranjeevi – Manchu Vishnu : ఇటు రేవంత్ రెడ్డితో చిరంజీవి.. అటు భట్టి విక్రమార్కతో మంచు విష్ణు..